AP Govt JobsCentral Govt JobsTG Govt Jobs

10వ తరగతితో ప్రభుత్వ ఉద్యోగాలు | MTS అసిస్టెంట్ ఉద్యోగాలు| NITTTR Notification 2025

10వ తరగతి పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మరియు స్టెనోగ్రాఫర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం రాత పరీక్షలు నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తుంది, ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన విద్యార్హతలు వయసు ఇతర వివరాలు అన్ని గ్రంథాలు ఇచ్చాను చూసుకొని మీరు అప్లై చేసుకోగలరు

ఆర్గనైజేషన్ :

ఈ జాబ్స్ ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ ( NITTR ) విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ఉద్యోగ ఖాళీలు మరియు అర్హతలు :

MTS ( మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ) : 05

ఈ నోటిఫికేషన్ ద్వారా MTS విభాగంలో మొత్తం 05 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి, వయస్సు మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : 04

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం నాలుగు ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు, కేవలం ఇంటర్ పాస్ అయింది దీనితో పాటు నిమిషానికి 30 పదాలు టైపింగ్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి అలాంటి వారు మాత్రమే అప్లై చేసుకోగలరు. వయసు మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు . ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి 35,000 జీతం ఇస్తారు.

స్టెనో గ్రాఫర్ గ్రేడ్ – 2 : 02

స్టెనో గ్రాఫర్ గ్రేడ్ 2 విభాగంలో రెండు ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థులు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి దీంతో పాటు కంప్యూటర్లో నిమిషానికి 50 పదాలు ఇంగ్లీషులో టైప్ చేయగలిగే స్కిల్ ఉండాలి లేదా నిమిషానికి 65 పదాలు హిందీలో టైప్ చేయగలిగే స్కిల్స్ ఉన్నవాళ్లు మాత్రమే అప్లై చేసుకోగలరు వయస్సు మినిమం 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోగలరు ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతం ఇస్తారు.

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 02

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ విభాగంలో మొత్తం రెండు ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. వయస్సు మినిమం 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోగలరు సెలెక్ట్ అయిన వారికి 45,000 రూపాయలు జీతం ఇస్తారు

Apply ప్రాసెస్ మరియు అప్లికేషన్ ఫీజు :

అప్లై చేసుకునే అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది దీనితోపాటు అప్లికేషన్ ఫీజును కూడా మనం చెల్లించాలి 750 రూపాయలు అప్లికేషన్ ఫీజ్ చెల్లించవలసి ఉంటుంది మీరు ఒకదానికంటే ఎక్కువ జాబ్స్ అప్లై చేస్తుంటే ఒక్కొక్క జాబ్ కి అడిషనల్ గా 500 రూపాయలు చెల్లించాలి.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అందరికీ ప్రభుత్వం పాత పరీక్ష నిర్వహిస్తుంది రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ ప్రొవైడ్ చేస్తుంది.

ముఖ్య తేదీలు :

అప్లై చేయడానికి చివరి తేదీ 15.10.2025 సాయంత్రం 5 గంటల లోపు మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *