Central Govt Jobs

10వ తరగతి తో 39,481 ఉద్యోగాలు | Latest SSC GD Constable Notification 2024

కేవలం 10వ తరగతి పూర్తి చేసిన నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( SSC ) నుండి భారీ నోటిఫికేషన్ అఫిషియల్ గా విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా GD కానిస్టేబుల్ విభాగంలో మొత్తం 39,481 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలను క్యాస్ట్ వారీగా ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ తో పాటు అన్ని రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. Apply చేసుకున్న అందరికీ వారి రాష్ట్రంలోనే పరీక్ష నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన అర్హతలు, వయస్సు ఇతర వివరాలు క్రింద ఇచ్చాను.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( SSC ) రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

SSC లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి GD కానిస్టేబుల్ విభాగంలో మొత్తం 39,481 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇందులో ఉన్న ఖాళీలను Male & Female సెపరేట్ గా ఇచ్చారు.

  1. BSF – 15,654
  2. CISF – 7,145
  3. CRPF – 11,541
  4. SSB – 819
  5. ITBP – 3,017
  6. AR – 1,248
  7. SSF – 35
  8. NCB – 22

ఈ 39,481 ఉద్యోగాలలో Male క్యాండిడేట్స్ కి 35,612 ఉద్యోగాలు Female క్యాండిడేట్స్ కి 3,869 ఉద్యోగాలు ఉన్నాయి.

More Jobs :

🔥 ఇంటర్ అర్హత తో సికింద్రాబాద్ రైల్వే లో భారీగా 11,500 పైగా ఉద్యోగాలు

🔥 ఇన్ఫోసిస్ లో భారీగా డేటా ఎంట్రీ ఉద్యోగాలు

🔥 SBI లో పరీక్ష లేకుండా 60,000 జీతంతో ఉద్యోగాలు

🔥 Groww కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తుంది

విద్య అర్హతలు :

01/01/2025 నాటికి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు :

01/01/2025 నాటికి మినిమం 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అప్లై చేసుకునే వారు 02/01/2002 నుండి 01/01/2007 మధ్య పుట్టి ఉండాలి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

SSC అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. మీరు మొదటిసారిగా అప్లై చేస్తుంటే OTR ( One Time Registration ) క్రియేట్ చేసుకోవాలి. OTR ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక అక్కడ అడిగిన డిటైల్స్ తో ఫిల్ చేసి మన ఫోటో కూడా అప్లోడ్ చేయాలి.

అప్లికేషన్ ఫీజు :

100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC / ST / ఎక్స్ సర్వీస్ మెన్ వారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఫీజున్ని ఆన్లైన్ లో UPI / నెట్ బ్యాంకింగ్ / క్రెడిట్ / డెబిట్ కార్డు ద్వారా చెల్లించాలి. 15/ 10/ 2024 వ తేది రాత్రి 11 గంటల లోపు చెల్లించాలి.

పరీక్ష విధానం :

Apply చేసుకున్న వారికి వారి సొంత రాష్ట్రంలోనే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. ఈ పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 20 ప్రశ్నలు 40 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలు 40 మార్కులు, ఎలిమెంటరీ మాథెమాటిక్స్ నుండి 20 ప్రశ్నలు 40 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 20 ప్రశ్నలు 40 మార్కులు, పరీక్షకు ఈ విధంగా సిలబస్ ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ :

పరీక్షలో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ టెస్ట్ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు.

రన్నింగ్ – Male అభ్యర్థులు 5 కిలో మీటర్లు ను 24 నిమిషాలలో పూర్తి చేయాలి. Female అభ్యర్థులు 1.6 కిలో మీటర్లు ను 8 నిమిషాల 30 సెకండ్స్ లో పూర్తి చేయాలి.

హైట్ – Male అభ్యర్థులు 170 సెంటి మీటర్లు ఉండాలి. Female అభ్యర్థులు 157 సెంటి మీటర్లు ఉండాలి.

చెస్ట్ – Male అభ్యర్ధులకు 80 సెంటి మీటర్లు ఉండాలి. ఎక్స్ ప్యాంఢ్ చేసినప్పుడు 5 సెంటి మీటర్లు పెరగాలి.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి లెవెల్ – 3 ప్రకారం 21,700 నుండి 69,100 వరకు బేసిక్ పే ఉంటుంది. SSC రూల్స్ ప్రకారం DA, HRA, TA కూడా వర్తిస్తాయి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 05/09/2024
Apply చేయడానికి చివరి తేది : 14/10/2024
ఫీజు చెల్లించి డానికి చివరి తేది : 15/10/2024

Official Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *