ఇంటర్ అర్హత తో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest JCI Recruitment 2024 | Govt Jobs In Telugu
ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ది జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( JCI ) లో భారీగా ఉద్యోగాల నియామకానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ మరియు జూనియర్ ఇన్స్పెక్టర్ విభాగంలో మొత్తం 90 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో ఉన్న ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి 35,000 జీతం ఇస్తారు.
జూనియర్ అసిస్టెంట్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 25 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జనరల్ – 11, OBC – 06, EWS – 02, SC – 04, ST – 02 ఈ విధంగా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ మరియు టైపింగ్ స్కిల్స్ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
జూనియర్ ఇన్స్పెక్టర్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇన్స్పెక్టర్ విభాగంలో మొత్తం 42 ( UR – 17, EWS – 04, OBC – 10, SC – 07, ST – 04 ) ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
More Jobs :
🔥 10వ తరగతి తో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో భారీగా అటెండెంట్ ఉద్యోగాలు
🔥 7వ తరగతి తో కోర్టు లో 300 ప్యూన్ ఉద్యోగాలు
🔥 ఇంటర్ అర్హత తో అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 10వ తరగతి తో రైల్వే లో పరీక్ష లేకుండా Group C & Group D ఉద్యోగాలు
అకౌంటెంట్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇన్స్పెక్టర్ విభాగంలో మొత్తం ( UR – 10, EWS – 02, OBC – 05, SC – 04, ST – 02 ) ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో M. Com పూర్తి చేసి ఉండాలి. ( లేదా ) B. Com పూర్తి చేసిన వారికి సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయస్సు :
01/09/2024 నాటికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ దిసబులిటి వారికి 10 సంవత్సరాల రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ & అప్లికేషన్ ఫీజు :
Apply చేసుకునే అభ్యర్థుల అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ & మెయిల్ ఐడి తో రిజిష్టర్ అవ్వాలి. అక్కడ అడిగిన డిటైల్స్ అన్ని ఫిల్ చేసి అవసరమైన సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు 250 రూపాయలను కూడా ఆన్లైన్ లోనే చెల్లించాలి. SC / ST / PWD వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు అందులో మెరిట్ ఆధారంగా చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి బేసిక్ పే తో పాటు DA, HRA, TA అన్ని రకాల అల్లోవెన్స్ కలుపుకొని నెలకు 35,000 జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 30/09/2024