మెట్రో రైల్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DMRCL Notification 2024
మెట్రో లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్, టెక్నీషియన్ విభాగంలో మొత్తం 13 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ 13 ఉద్యోగాలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చేసుకొని మీ క్యాస్ట్ లో జాబ్స్ కి Apply చేసుకోగలరు.ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు 10th / 10+2 / డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారికి ఫీజు పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 65,000 వరకు జీతం ఇస్తారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో సూపర్వైజర్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సూపర్వైజర్ విభాగంలో 10 ( UR – 08, OBC – 02) ఉద్యోగాలు, టెక్నీషియన్ విభాగంలో 03 ( UR – 03 ) ఉద్యోగాలు. SC/ ST వారు జనరల్ కేటగిరి లో పోస్ట్స్ కి అప్లై చేసుకోవచ్చు.
విద్య అర్హతలు :
సూపర్వైజర్ – ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / మెకానికల్ విభాగంలో 3 సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా పూర్తి చేసిన అందరూ Apply చేసుకోవచ్చు.
టెక్నీషియన్ – కేవలం 10th / 10+2 / ITI పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
More Jobs :
🔥 తెలంగాణ విద్యుత్ శాఖలో 3000 ఉద్యోగాలు
🔥 AP రెవిన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా 30,000 జీతంతో ఉద్యోగాలు
🔥 10వ తరగతి తో కోర్టు లో 42,000 జీతంతో అటెండర్ ఉద్యోగాలు
🔥 10వ తరగతి తో APSRTC లో ఫీజు పరీక్ష లేకుండా 7,673 ఉద్యోగాలు
🔥 10వ తరగతి తో ఫీజు పరీక్ష లేకుండా తెలంగాణ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
వయస్సు :
సూపర్వైజర్ – మినిమం 23 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు Apply చేసుకోవచ్చు.
టెక్నీషియన్ – మినిమం 23 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ :
కేవలం పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ పంపించాలి. ముందుగా మనం అఫిషియల్ వెబ్సైట్ కి వెళ్లి అప్లికేషన్ ఫారం నీ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫారం నీ తప్పులు లేకుండా నింపాలి. అప్లికేషన్ ఫారం కి సర్టిఫికెట్స్ జిరాక్స్ లను జత చేసి ఎన్వలప్ కవర్ లో పెట్టి పంపించాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. ఇంటర్వ్యూ వెళ్లి రావడానికి అయ్యే ఖర్చులు మీరే భరించాలి.
జీతం :
సూపర్వైజర్ జాబ్స్ కి జాబ్ లో చేరగానే నెలలు 65,000 జీతం, టెక్నీషియన్ కి నెలకు 46,000 జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 11/09/2024