10వ తరగతి తో తెలంగాణ RTC లో 3035 ఉద్యోగాలు | Latest TGSRTC Notification 2024
తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC ) లో ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో మొత్తంగా 3,035 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలను జిల్లాల వారీగా మరియు క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోగలరు. సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది.
TGSRTC లో డిపోట్ మేనేజర్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్, శ్రామిక్, సెక్షన్ ఆఫీసర్, డ్రైవర్, అసిస్టెంట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్ తో పాటు మరికొన్ని విభాగంలో మొత్తం 3,035 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 10th/ ఇంటర్ / డిగ్రీ / B.Tech / MBBS పూర్తి చేసిన అందరికీ విడి విడిగా ఉన్నాయి. Apply చేసుకున్న వారిని కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి 19,000 నుండి 50,000 వరకు జీతం ఇస్తారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ ఉద్యోగాలను తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో మొత్తం 3,035 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఏ జాబ్ రోల్ కి ఎన్ని ఖాళీలు ఉన్నాయో క్రింద ఇచ్చాను.
- డిపోట్ మేనేజర్ : 25
- అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ : 15
- శ్రామిక్స్ : 743
- ట్రాఫిక్ : 84
- మెక్ : 114
- డ్రైవర్ : 2,000
- అసిస్టెంట్ ఇంజనీర్ ( సివిల్ ) : 23
- సెక్షన్ ఆఫీసర్ ( సివిల్ ) : 11
- అకౌంట్స్ ఆఫీసర్ : 06
- మెడికల్ ఆఫీసర్ ( జనరల్ ) : 07
- మెడికల్ ఆఫీసర్ ( స్పెసిలిస్ట్ ) : 07
విద్య అర్హతలు :
సంబంధిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ / B.Tech / MBBS పూర్తి చేసి ఉండవలెను. డ్రైవర్ జాబ్స్ కి Apply చేసుకునే వారికి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
More Jobs :
🔥 తెలంగాణ విద్యుత్ శాఖలో 3000 ఉద్యోగాలు
🔥 10వ తరగతి తో మెట్రో లో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్, టెక్నీషియన్ ఉద్యోగాలు
🔥 అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు
🔥 10వ తరగతి తో APSRTC లో ఫీజు పరీక్ష లేకుండా 7,673 ఉద్యోగాలు
🔥 10వ తరగతి తో కోర్టు లో అటెండర్ ఉద్యోగాలు
వయస్సు :
మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC / ST/ OBC వారికి 5 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ & ఫీజు :
కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేసుకోవాలి. TGSRTC అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన సర్టిఫికెట్స్ నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. జనరల్, OBC, EWS వారు 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మిగతావారు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
సెలక్షన్ ప్రాసెస్ & జీతం :
వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ TGSRTC పరిశీలించి పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి మినిమం 19,000 నుండి 50,000 వరకు జీతం ఇస్తారు. జీతంతో పాటు అల్లోవెన్స్ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది.