Central Govt Jobs

తెలుగు వారికి భారీగా 300 ఉద్యోగాలు | Latest Indian Bank Notification 2024

తెలుగు రాయడం వచ్చిన వారికి ఇండియన్ బ్యాంక్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ బ్యాంక్ కి మన దేశంలో అన్ని రాష్ట్రాలలో బ్రాంచేస్ ఉన్నాయి. ఇండియన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ చెన్నై లో ఉంది. చెన్నై నుండి ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రాష్ట్రాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉంద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఇండియన్ బ్యాంక్ లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలను ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వారికి సెపరేట్ గా ఇచ్చారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి దీనితో పాటు లోకల్ లాంగ్వేజ్ తెలుగు రాయడం వచ్చి ఉండాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 48,500 బేసిక్ పే తో పాటు అన్ని రకాల అలోవెన్స్ కూడా వర్తిస్తాయి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

మన దేశంలో ప్రముఖ బ్యాంక్ లలో ఒకటి అయినటువంటి ఇండియన్ బ్యాంక్ ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

ఇండియన్ బ్యాంక్ లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో అన్ని క్యాస్ట్ లకు కలిపి 300 ఉంద్యోగాలు ఉన్నాయి. ఈ 300 ఉద్యోగాలను 5 రాష్ట్రాలకు డివైడ్ చేసి ఇచ్చారు. తమిళనాడు లో 160, కర్ణాటక లో 35, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో 50, మహారాష్ట్ర లో 40, గుజరాత్ లో 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

More Jobs :

🔥 తెలుగు వారికి విప్రో కంపెనీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 Phone Pe కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 7,413 ఉద్యోగాలు

🔥 కరెంట్ ఆఫీస్ లో మొదటిగా సారిగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

విద్య అర్హతలు :

Apply చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి ఉండాలి. దీనితో పాటు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వారికి తెలుగు రాయడం తప్పని సరిగా వచ్చి ఉండాలి.

వయస్సు :

మినిమం 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్న అందరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ ST వారికి 05 సంవత్సరములు, OBC వారికి 03 సంవత్సరములు, దివ్యాంగులకు 10 సంవత్సరములు రిజర్వేషన్ వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
SC/ ST / PWD వారు కేవలం ఇంటిమేషన్ చార్జెస్ 175/- రూపాయలు పే చేయాలి.
మిగతావారు అప్లికేషన్ ఫీజు మరియు ఇన్టైమేషన్ చార్జెస్ మొత్తం కలుపుకొని 1000/- పే చేయాలి.

Apply ప్రాసెస్ :

అన్ని రాష్ట్రాల వారు ఈ జాబ్స్ కి Apply చేసుకోవచ్చు. మీరు ముందుగా ఇండియన్ బ్యాంక్ అఫిషియల్ వెబ్సైట్ కెరీర్ పేజీ లోకి వెళ్ళాలి. అక్కడ అడిగిన అన్ని డిటైల్స్ ఫిల్ చేయాలి అలానే మీ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫీజు నీ కూడా ఆన్లైన్ లోనే పే చేయాలి.

సిలబస్ & పరీక్ష విధానం :

మొత్తం 155 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 3 గంటల సమయం ఇస్తారు. ఈ 155 ప్రశ్నలకు సంబంధించి సిలబస్ ఈ విధంగా ఉంటుంది. రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మీద 45 ప్రశ్నలు 60 మార్కులు, జనరల్ / ఎకానమీ / బ్యాంకింగ్ అవేర్నెస్ మేధ 40 ప్రశ్నలు 40 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 35 ప్రశ్నలు 40 మార్కులు, డేటా అనాలసిస్ మీద 35 ప్రశ్నలు 60 మార్కులు, ఇలా మొత్తం 155 ప్రశ్నలు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు :

అన్ని రాష్ట్రాల వారికి వారి సొంత రాష్ట్రంలోనే పరీక్ష ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ వారికి విజయవాడ, గుంటూరు మరియు విశాఖపట్నం, తెలంగాణ వారికి హైదరాబాద్ లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న వారికి వారి సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారిని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. తరువాత పోలీసు వెరిఫికేషన్ పూర్తి అయ్యాక జాయినింగ్ లెటర్ ఇస్తారు.

జీతం :

జాబ్ లో జాయిన్ అయిన వారికి బేసిక్ పే 48,500 తో పాటు DA, CCA, HRA లాంటి అల్లోవెన్స్ వర్తిస్తాయి

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *